వినుకొండ: ఏరువాకను ప్రారంభించిన ఎమ్మెల్యే

53చూసినవారు
వినుకొండ: ఏరువాకను ప్రారంభించిన ఎమ్మెల్యే
ఈపూరు గ్రామంలో బుధవారం ఏరువాక కార్యక్రమాన్ని శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జీవి పొలంలోకి దిగి అరక దున్నారు. సకాలంలో వర్షాలు కురిసి, పంటలు బాగా పండి రైతులు పాడిపంటలతో సిరిసంపదలతో తులతూగాలని భగవంతుని ప్రార్థించారు. అనంతరం రైతులకు ప్రభుత్వం రాయితీ పై అందిస్తున్న వివిధ రకాల విత్తనాలను, ట్రాక్టర్ రోటో రైటర్, పరుగు మందు పిచికారి చేసే ట్రోన్లు అందజేశారు.

సంబంధిత పోస్ట్