వినుకొండ: తిరునాళ్ళ వేడుకలపై అధికారుల సమీక్ష సమావేశం

84చూసినవారు
వినుకొండ: తిరునాళ్ళ వేడుకలపై అధికారుల సమీక్ష సమావేశం
పల్నాడు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ మదమంచిపాడు వీరాంజనేయ స్వామివారి తిరునాళ్ల ఏప్రిల్ 17న జరగనుంది. ఈ నేపథ్యంలో తిరునాళ్ల వేడుకలు, ఏర్పాట్లపై వినుకొండ తహశీల్దార్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో తహశీల్దారు సురేష్ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ, దేవాదాయ శాఖ, పోలీసు, ఆర్టీసీ, ఆర్ డబ్ల్యూ ఎస్, పంచాయతీ రాజ్, అగ్నిమాపక, విద్యుత్ శాఖ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్