వినుకొండ రాజధాని అమరావతి ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వివిఆర్ కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాస్ రావు, ప్రసారం చేసిన సాక్షి టీవీ యాజమాన్యం వైయస్ భారతి పై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. దీనిలో భాగంగా మహిళలపై వ్యాఖ్యలను ఖండిస్తూ మంగళవారం వినుకొండ పట్నంలో మహిళలు నిరసన ర్యాలీ చేసిన అనంతరం ఎమ్మార్వో సురేష్ నాయక్ కి వినతిపత్రం అందజేశారు.