వినుకొండ పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్ లో ఉన్న బిక్కి రాములు, ఖాజామీయ, కమతం బాల వజ్రం, పమ్మి యోగి సుబ్బారెడ్డిల స్థూపాన్ని బంధుమిత్రుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆవిష్కరించారు. బంధుమిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బొప్పూడి అంజమ్మ, భవాని, శోభ, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు.