వినుకొండ: ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో ప్రజా దర్బార్

55చూసినవారు
వినుకొండ: ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో ప్రజా దర్బార్
పట్టణంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు కార్యాలయంలో బుధవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీజీవీ ఆంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవీ ఆంజనేయులు గారు ప్రజల నుండి వినతులు స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా చీఫ్ విప్‌ కి తెలియజేయడంతో, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజా దర్బార్‌కు ప్రజల నుండి విశేష స్పందన లభించింది.

సంబంధిత పోస్ట్