తల్లికి వందనం పథకంపై వినుకొండలో మాట్లాడిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు. కూటమి ప్రభుత్వం చేపట్టిన పథకాలు చూసి వైసీపీ ఓర్వలేకపోతోందని ఆరోపించారు. వారు తీసుకొచ్చిన నిబంధనలతోనే ఇప్పుడు తాము లబ్ధిదారులను ఎంపిక చేశామని గుర్తు చేశారు. ఒక్కరోజే తల్లుల ఖాతాల్లో రూ.10,091 కోట్లు జమ చేయడం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. ఈ పథకంపై విమర్శలు చేసే అర్హత వైసీపీకి లేదన్నారు.