వినుకొండ పట్టణ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం పీఎం శ్రీ పథకం కింద భారత స్కౌట్ అండ్ గైడ్స్ ట్రూప్ యూనిట్ ప్రారంభం అయింది. హెచ్ఎం పి.హవీలా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, విద్యార్థులు నిజాయితీగా, క్రమశిక్షణతో ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలని సూచించారు. 26 మంది విద్యార్థులకు యూనిఫామ్ అందించి స్కౌట్ విధులపై అవగాహన కల్పించారు.