కొండపై వేంచేసి ఉన్న శ్రీ గంగాపార్వతి సమేత రామలింగేశ్వరస్వామి వారి తిరునాళ్ల వేడుకలు ఆదివారం జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఘాట్ రోడ్డులో ప్రయాణించి కొండపైకి చేరుకునే భక్తుల కోసం 40 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ జవ్వాజి నాగేశ్వరరావు శనివారం తెలిపారు. బస్సులు తెల్లవారుజామున 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటాయని, టికెట్ ధర పెద్ద లకు రూ.40, రూ. పిల్లలకు 20 నిర్ణయించినట్లు డిఎం తెలిపారు.