కూటమి ప్రభుత్వం సుపరిపాలనకు తొలి అడుగు పడి నేటికి సంవత్సరకాలం సందర్భంగా గురువారం వినుకొండ ప్రభుత్వ చీఫ్ విప్ టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కూటమి నేతల చిత్రపటాలకు కార్యకర్తలు, నాయకులు పాలాభిషేకం చేశారు. వారు మాట్లాడుతూ.. కూటమి పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతోందన్నారు.