వినుకొండలోని ఎన్ఎస్పీ కాలువను అక్రమంగా ఆక్రమించినట్లు స్థానికులు అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమాచారంతో వెంటనే ఎన్ఎస్పీ అధికారులు స్పందించారు. డిగ్రీ కళాశాల సమీపంలో ఎన్ఎస్పీ కాలువను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టి, ఐరన్ గదులు తెచ్చి కాలువపై పెట్టారు. స్థానికుల సమాచారంతో అధికారులు వెంటనే స్పందించి అక్రమ నిర్మాణాలు అపి వేయించి, కాలువపై ఏర్పాటు చేసిన ఐరన్ గది తీసివేయించారు.