వినుకొండ పట్టణంలోని టిడిపి కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యల పట్ల అధికారులు ఎవరైనా అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని, ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో ఉండాలని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. అన్నారు. ఆయన మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు కలసికట్టుగా పనిచేసి ప్రజల సమస్యల పరిష్కారంలో నియోజకవర్గాన్ని, పల్నాడు జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలపాల్సిన అవసరం ఉందన్నారు.