పల్నాడు జిల్లాలోని వినుకొండలోని కీర్తన గోల్డ్ లోన్ సంస్థపై బంగారం మోసం ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విమలారాణి అనే మహిళ 24 సవర్ల బంగారాన్ని తాకట్టు పెట్టి రూ. 6 లక్షల లోన్ తీసుకున్నారు. అప్పటి నుంచి జరిగిన లావాదేవీల్లో క్రమంగా నగదు మొత్తాన్ని పూర్తిగా చెల్లించినట్టు ఆమె చెబుతున్నారు. తన బంగారం తిరిగి ఇవ్వమని సంస్థ సిబ్బందిని పలుమార్లు కోరినప్పటికీ, వారు కాలయాపన చేస్తూ వస్తున్నారని శుక్రవారం ఆమె ఆరోపించారు.