ప్రభుత్వ చౌక దుకాణాలు, వంట గ్యాస్ సరఫరా పై నిఘా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని వినుకొండ తహశీల్దార్ సురేష్ నాయక్ కోరారు. శుక్రవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ అధ్యక్షతన విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఎండియూ ఆపరేటర్లు, మండల విద్యాశాఖ అధికారి సయ్యద్ జఫ్రూలా, సిడిపిఓ అనురాధ, డిటి. మురళి, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.