పాడి పరిశ్రమ అభివృద్ధికి, పాల ఉత్పత్తిని పెంపొందించడంలో భాగంగానే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మినీ గోకులం షెడ్లను మంజూరు చేస్తుందని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ఈపూరు మండలం కొండ్రముట్ల గ్రామం లో శుక్రవారం మినీ గోకులం షెడ్డును శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో గొర్రెలు, మేకలు, కోడి, పశువుల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.