వినుకొండ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళ కానిస్టేబుల్ సావిత్రికి శ్రీమంతం కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ వేడుకలో సీఐ శోభన్ బాబు, ఎస్ఐలు స్వర్ణలత, షమీర్ భాషా, సత్యనారాయణ, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. సంప్రదాయబద్ధంగా బట్టలు, గాజులు, పసుపు కుంకుమ, మిఠాయిలు అందజేశారు.