పెంచిన పెన్షన్ అందిస్తున్నాం: ఎమ్మెల్యే

67చూసినవారు
పెంచిన పెన్షన్ అందిస్తున్నాం: ఎమ్మెల్యే
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం వెంటనే పెన్షన్ పెంచి ప్రజలకు నేరుగా అందిస్తుందని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. మంగళవారం బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల గ్రామంలో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లబ్ధిదారులకు నేరుగా పెన్షన్ నగదు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి హామీని నెరవేర్చుతూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్