H-1B వీసా రిజిస్ట్రేషన్లను త్వరలో ప్రారంభించనున్నట్లు అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (USCIS) ప్రకటించింది. మార్చి 7 నుంచి 24 వరకూ ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపింది. 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కోటా కింద జారీచేసే ఈ వీసాల కోసం ఆయా సంస్థలు, ప్రతినిధులు ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవాలని వెల్లడించింది. H-1B వీసా కోసం ఫీజు కింద 215 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.