ఏపీ చరిత్రలో నిలిచేలా 'హైందవ శంఖారావం' పేరుతో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆదివారం విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వద్ద మ. 12 గంటలకు ప్రారంభమై.. సా. 5 గంటల వరకు ఈ సభ కొనసాగనుంది. ఈ సభకు సాధువులు, మఠాధిపతులు, హిందూ ప్రముఖులు తరలివస్తున్నారు. ఇంకా ఈ సభకు 3,300 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇందుకు 15 ప్రత్యేక రైళ్లతో పాటు రెండు వేల బస్సులను ఏర్పాటు చేశారు.