AP: ఈ నెల 15వ తేదీ నుంచి తొలిదశలో జీడిపల్లి వరకు హంద్రీ-నీవా నీటిని విడుదల చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఆలోపు తొలిదశలో చేపట్టిన పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కాలువ పూర్తి సామర్థ్యం మేరకు 3,850 క్యూసెక్కుల నీటిని ఇవ్వాలన్నారు. ఇందుకోసం మూడు రోజుల ముందే కాలువ వెడల్పు పనులు పూర్తి చేయాలన్నారు. జీడిపల్లి నుంచి గొల్లపల్లి, మారాల, చెర్లోపల్లి జలాశయాలను నింపాలన్నారు.