ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అంచనాలకు తగ్గట్లుగానే బీజేపీ ఆధిక్యతను ప్రదర్శిస్తుందని మాజీ ఎంపీ జీవీఎల్ తెలిపారు. 41 సీట్లలో ఆధిక్యంలో బీజేపీ ఉందని అన్నారు. ఖచ్చితంగా 46 సీట్లకు తగ్గకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి ఇది చారిత్రాత్మక విజయమని తెలిపారు. ఆప్‌ను చిత్తుగా ఓడించడం గొప్ప ఆనందం ఇచ్చిందని తెలిపారు. మరోసారి మోదీ నాయకత్వానికి ఢిల్లీ ఓటర్లు జైకొట్టారని జీవీఎల్ తెలిపారు.