AP: తప్పుడు సాక్ష్యం చెప్పమని హోటల్ యజమాని వేధింపులు భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. రౌతుల రమేశ్ అనే వ్యక్తి ఓ హోటల్‌లో పని చేస్తుంటాడు. ఆ హోటల్ యజమాని, అతని స్నేహితులు కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పమని రమేశ్‌ను ఒత్తిడి చేశారు. చంపేస్తానని బెదిరించారు. దాంతో రమేశ్ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.