పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'హరి హర వీరమల్లు'. ఈ సినిమా ఫైనల్ రిలీజ్ తేదీని టీమ్ ప్రకటించింది. జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు వెల్లడించింది. 'జీవితకాలపు యుద్ధానికి సిద్ధంగా ఉండండి. ధర్మం కోసం యుద్ధం ప్రారంభమవుతుంది. జూన్ 12న హరిహర వీరమల్లు రిలీజ్ కానుంది' అంటూ పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రానికి క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు.