AP: వైఎస్ జగన్‌కు ప్రభుత్వం సరైన భద్రత కల్పించడంలేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్‌కు ప్రభుత్వం భద్రత తగ్గిస్తోందనేది వైసీపీ ఆరోపణ. గుంటూరు మిర్చి యార్డు, రాప్తాడు, తెనాలి, పొదిలి, తాజాగా సత్తెనపల్లి. ఇలా ఆయన ఏ పర్యటనకు వెళ్లినా ఆయనకు సరైన భద్రత కల్పించటం లేదని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. ప్రశ్నించే గొంతుకను లేకుండా చేస్తే.. ఏపీలో ఇక తమకు అడ్డూఅదుపు ఉండదని చంద్రబాబు, లోకేష్ భావిస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.