ప్రస్తుతం సోషల్ మీడియాలో గాల్లో ఎగిరే చేపకు సంబంధించిన ఓ వీడియో వైరలవుతోంది. ఈ చేపలు 200 మీటర్ల వరకు మాత్రమే ఎగురుతాయి. ఈ చేపను గ్లైడర్ అంటారు. ఈ చేప శరీరానికి ఇరు వైపులా రెక్కలు ఉంటాయి. ఈ రెక్కల సహాయంతో అవి ఎగరగలవు. ఈ చేపల పొడవు 17 నుంచి 30 సెంటీమీటర్లు. నీటి ఉష్ణోగ్రత 20 డిగ్రీల కంటే తక్కువగా ఉన్నప్పుడు ఈ చేపలు ఎగరలేవు. ఈ చేపను ప్రపంచవ్యాప్తంగా ‘ఫ్లయింగ్ ఫిష్’ అని కూడా పిలుస్తారు.