AP: విశాఖపట్నం శివారు ప్రాంతమైన తాటిచెట్లపాలెం రెడ్డివీధికి చెందిన ఓ బాలికకు రీల్స్ చేస్తూ ఇన్‌స్టాలో అప్లోడ్ చేస్తుంటుంది. ఆ బాలిక ఇంటికి సమీపంలోనే ఉండే భార్గవ్ రీల్స్ చూసి ఆమెపై ఇష్టం పెంచుకున్నాడు. బాలికతో పరిచయం పెంచుకుని తనతో రీల్స్ చేయమని కోరాడు. బాలిక ఒప్పుకోవడంతో కైలాసపురం కొండ మీద ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.