టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ ట్రావిస్ హెడ్ ప్రశంసల జల్లు కురిపించాడు. చివరి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్ చేయకపోవడం వల్లే తమ విజయం సాధ్యమైందని అభిప్రాయపడ్డాడు. ‘ఈ సిరీస్‌లో బుమ్రా మాకు ఎన్నో పీడకలలు మిగిల్చాడు. బుమ్రా లాంటి అత్యుత్తమ బౌలర్‌ను ఎదుర్కొన్నామని భవిష్యత్తులో కథలు కథలుగా చెప్పుకుంటాం. మా జట్టులోని 15 మందిని బుమ్రా తన బౌలింగ్‌తో భయపెట్టాడు’ అని పేర్కొన్నాడు.