ఆకాశ్ మిసైల్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్త డాక్టర్ ప్రహ్లాద రామారావు. DRDOలో దశాబ్దాలపాటు సేవలందించారు. 37 ఏళ్ల వయసులో డాక్టర్ APJ అబ్దుల్ కలాం ఆయనను ఆకాశ్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా నియమించారు. 1983-2003 మధ్య 1,000 మంది శాస్త్రవేత్తలతో స్వదేశీ సాంకేతికతతో ఆకాశ్‌ను అభివృద్ధి చేశారు. 2005-08 ట్రయల్స్‌లో విజయం సాధించి, 2008లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరింది. ప్రస్తుతం ఆయన హైలైనర్ టెక్నాలజీస్‌లో LENR రీసెర్చ్‌పై దృష్టి సారిస్తున్నారు.