తమిళ నటుడు సముద్రఖని గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. విమానం, ఆర్‌ఆర్‌ఆర్, అల వైకుంఠ పురం, క్రాక్ లాంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు. అయితే ఆయన డైరెక్షన్‌లో 2016లో వచ్చిన ‘అప్ప’ మూవీ చూసి రాజమౌళి తండ్రి ఫోన్ చేసి తనని హత్తుకోవాలని ఉందని చెప్పారని ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కాగా ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తోన్న గేమ్ ఛేంజర్‌లో చరణ్‌కు సోదరుడిగా కనిపించనున్నారు.