మధ్యప్రదేశ్ జనక్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్ చౌరాహాలో దారుణం జరిగింది. దీపక్ అనే వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు. దీపక్ ప్రవర్తనతో విసిగిపోయిన భార్య అతడికి విడాకులు ఇచ్చింది. అయితే తన వద్ద ఉంటున్న కుమార్తెలను దీపక్ చిత్రహింసలు పెడుతున్నాడు. భార్యపై కోపాన్ని కుమార్తెలపై చూపిస్తున్నాడు. చిన్న కుమార్తెను బెల్టుతో విచక్షణారహితంగా కొట్టాడు. దీంతో తండ్రిపై పోలీసులకు కుమార్తెలు ఫిర్యాదు చేశారు.