భారత సంతతికి చెందిన ప్రఖ్యాత ఖగోళ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ పుచ్చా రాగదీపికను ఏపీ సీఎం చంద్రబాబు అభినందించారు. విశ్వంలోని కృష్ణ బిలాల గురించి డాక్టర్ రాగదీపిక కీలక ఆవిష్కరణలు చేశారని.. ఆమెకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నానన్నారు. ఆమె గుంటూరు జిల్లా తెనాలి ముద్దుబిడ్డ అని చంద్రబాబు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా తమదైన ముద్ర వేసిన తెలుగు మహిళల సరసన రాగాదీపిక చేరారని కొనియాడారు.