తాడిపత్రిలో భారీగా పోలీసుల బందోబస్తు (వీడియో)

60చూసినవారు
AP: తాడిపత్రి పట్టణంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలోకి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అడుగుపెట్టనున్నట్లు సమాచారం వచ్చింది. దాంతో పెద్దారెడ్డిని అడ్డుకునేందుకు టీడీపీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్