AP: నైరుతి బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రేపటిలోగా అల్పపీడం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ద్రోణి ప్రభావంతో రేపటి నుంచి 3 రోజుల పాటు రాయలసీమ, దక్షిణ కోస్తాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం కాకినాడ, కోనసీమ, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.