ఏపీలో భారీ వర్షం (వీడియో)

84చూసినవారు
AP: రాష్ట్రంలో ఒకవైపు ఎండలు, మరోవైపు వానల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజు రోజుకి భిన్నవాతావరణం నెలకొంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం, కపిలేశ్వరం మండలాల్లో కుండపోత వర్షం కురుస్తుంది. వర్షాల కారణంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రైతులు పొలాల్లో, చెట్ల కింద ఒంటరిగా ఉండరాదన్నారు.

సంబంధిత పోస్ట్