ఢిల్లీలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదరుగాలులతో కూడిన వర్షాలో పలు చోట్ల భారీ చెట్లు కుప్పకూలాయి. అయితే నబీ కరీం ప్రాంతంలోని అర్కాన్షా రోడ్డు వద్ద నిర్మాణంలో ఉన్న ఇంటి గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు మృతి చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ప్రస్తుతానికి అక్కడ ఉన్న వారిని ఖాళీ చేయించారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్చారు.