ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షం

72చూసినవారు
ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షం
AP: ఉపరితల ద్రోణి ప్రభావంతో కాసేపట్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల్లో సాయంత్రం అక్కడక్కడ ఉరుమలు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షం పడొచ్చని అంచనా వేసింది. ఈ సమయంలో పిడుగులు కూడా పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్