AP: అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలోని ఇవాళ సాయంత్రం ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో వాహనచోదకులు, పాదచారులు, వ్యవసాయ పనులకు వెళ్లిన గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ వర్షం కారణంగా మామిడి, జీడి మామిడి పిందెలు రాలిపోయాయని పలువురు గిరిజన రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.