ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు

83చూసినవారు
ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు
AP: రాబోయే రెండు రోజులలో ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయవ్య ఉత్తర ప్రదేశ్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని.. ద్రోణి ప్రభావంతో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ పరిస్థితుల్లో ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్