AP: రాష్ట్రంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అయితే మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ-మధ్య అరేబియా సముద్రం నుంచి దక్షిణ ఒడిశా తీరం వరకు కొనసాగుతుందని తెలిపింది. దీంతో శనివారం, ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా కొన్నిచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.