AP: నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉత్తర-వాయువ్య దిశగా ఈ ఫెంగల్ తుఫాన్ పయనిస్తుందని.. ప్రస్తుతానికి పుదుచ్చేరికి 270 కిమీ, చెన్నైకి 300 కిమీ దూరంలో కేంద్రీకృతమైందని వెల్లడించింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇవాళ, రేపు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్నిచోట్ల అతి తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.