AP: ద్రోణి కొనసాగుతుందని, దీని ప్రభావంతో మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. పార్వతీపురం మన్యం, అల్లూరి, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో రెండు రోజుల పటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.