AP: రాష్ట్రంలో బుధ, గురువారం భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. అనంతపురం, సత్యసాయి, కడప, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వానలు పడతాయని పేర్కొంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.