AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. గుంటూరులో భారీ ఈదురుగాలులు, వర్షానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బాపట్ల జిల్లా వేటపాలెం, చీరాల, చినగంజాం, అద్దంకి, చెరుకుపల్లి గ్రామాల్లలో వర్షం దంచికొడుతోంది. అటు విజయవాడలో రాత్రి నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. దాంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.