ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

72చూసినవారు
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
రుతుపవన ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజులు ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తాజాగా వెల్లడించింది. కోస్తాంధ్రలో భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శుక్రవారం మన్యం, శ్రీకాకుళం, అల్లూరి, విజయనగరం, విశాఖ, ఏలూరు, కాకినాడ, ఎన్టీఆర్, అనకాపల్లి, కృష్ణా, కోనసీమ, గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

సంబంధిత పోస్ట్