AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. శ్రీకాకుళంలో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. విజయనగరం, విశాఖ, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం నుంచి వాన పడుతోంది. దాంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.