ఆ జిల్లాలో ఆందోళన కలిగిస్తున్న హెపటైటిస్‌ కేసులు

78చూసినవారు
ఆ జిల్లాలో ఆందోళన కలిగిస్తున్న హెపటైటిస్‌ కేసులు
AP: రాష్ట్రంలో హెపటైటిస్‌-బీ, సీ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వైరస్‌ సోకిన వారు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులుగా మారుతున్నారు. ఏపీలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో హెపటైటిస్‌-బీ, సీ కేసులు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. పాతికేళ్ల కిందట ఆర్‌ఎంపీ వైద్యులు ఒకే నీడిల్‌ ద్వారా ఎక్కువ మంది రోగులకు వేసిన ఇంజెక్షన్ల పర్యవసానాలు ఇప్పుడు కన్పిస్తున్నాయి. క్షవరం, గడ్డం చేసేందుకు ఒకే బ్లేడ్లు ఉపయోగించిన ప్రభావం కూడా కేసుల పెరుగుదలకు కారణమవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్