ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఏసీబీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ నోటీసుల్లో 5 ప్రశ్నలను సంధించింది. ట్వీట్ పోస్ట్ చేసింది మీరేనా? ఇంకెవరైనా పోస్ట్ చేశారా?, 16 మంది ఎమ్మెల్యేలకు డబ్బులు ఎర చూపారంటూ ట్వీట్‌లో పేర్కొంటున్న విషయంతో మీరు ఏకీభవిస్తారా?, ఫోన్ కాల్ అందుకున్న ఆ 16 మంది మంది ఎవరు?, వారికి వచ్చిన నంబర్లు, సంబంధిత సమాచారాన్ని అందించండి. ఈ ఆరోపణలపై సాక్ష్యాలు కానీ, ఇతర సమాచారం కానీ ఉంటే అందించండి అని కోరింది.