ప్రముఖ స్టార్ హీరో విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగంలో కోయంబత్తూరు సూలూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న కోయంబత్తూరు సబర్బన్ ఈస్ట్ జిల్లా కార్యదర్శిగా బాబు అనే ఆటో డ్రైవర్ ను నియమించారు. విజయ్ వీరాభిమాని అయిన బాబు తనకు పార్టీలో కీలకమైన పదవి ఇచ్చినందుకు ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన స్నేహితులు, పార్టీ మహిళా కార్యకర్తలు ఆయనను సత్కరించారు.