మాస్ మహారాజా రవితేజ నటించిన 'ఇడియట్' మూవీ హీరోయిన్ రక్షిత గుర్తున్నారా? అప్పట్లో కుర్రకారుల డ్రీమ్ గర్ల్. ఈమెను వెండి తెరకు దర్శకుడు పూరీ జగన్నాథ్ కన్నడలో ‘అప్పు’ మూవీ ద్వారా పరిచయం చేశారు. పలు తెలుగు సినిమాల్లో నటించిన ఆమెకు అవకాశాలు తగ్గడంతో పెళ్లి చేసుకొని స్థిరపడింది. తాజాగా జరిగిన ఓ సినీ ఈవెంట్‌కు వచ్చిన ఆమె, బరువు పెరిగి ఎవరూ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.