TG: తిరుమలలో వెంకటేశ్వర స్వామిని హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున స్వామివారి సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదా ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి, పట్టువస్త్రంతో సత్కరించారు.