అధిక కొలెస్ట్రాల్ శరీరంలో అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా అధిక కొలెస్ట్రాల్ గుండె సంబంధిత వ్యాధులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, మందులు వంటివి తీసుకోవాలని సూచిస్తున్నారు. లో-డెన్సిటీ లిపోప్రోటీన్ (LDL) దీన్ని చెడు కొలెస్ట్రాల్ అని పిలుస్తారు. ఇది ధమనుల్లో పేరుకుపోయి రక్త ప్రసరణను అడ్డుకుని గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.